వైద్యుల సమాచారాన్ని వినియోగించుకోండి: ఐఆర్‌డీఏఐ

ఈనాడు, హైదరాబాద్‌: పాలసీదారులకు మెరుగైన చికిత్స, ఓపీడీ సేవలు అందేలా బీమా సంస్థలు హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ రిజిస్ట్రీ (హెచ్‌పీఆర్‌)ని వినియోగించుకోవాల్సిందిగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచించింది. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ కలిసి దేశంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, సంప్రదాయ చికిత్సలను అందించే వారితో హెచ్‌పీఆర్‌ను రూపొందించాయి. ‘సాధారణ బీమా, ఆరోగ్య బీమా సంస్థలు హెచ్‌పీఆర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఓపీడీ, ఇతర ఆరోగ్య సేవలను అందించే డాక్టర్లు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులను సులభంగా గుర్తించేందుకు వీలవుతుంద’ని ఐఆర్‌డీఏఐ తెలిపింది. హెచ్‌పీఆర్‌ ఐడీతో వైద్యులకు ప్రొఫెషనల్‌ ఇండెమ్నిటీ పాలసీని సులభంగా అందించేందుకూ వీలవుతుందని పేర్కొంది. వైద్యులు ఆధార్‌ లేదా ఇతర కేవైసీ పత్రాలు, వైద్య అర్హత ధ్రువీకరణలతో హెచ్‌పీఆర్‌ ఐడీని పొందేందుకు వీలవుతుంది. ఈ ప్రత్యేక గుర్తింపు ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఇతర భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు వైద్య నిపుణులకు సులభమవుతుంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు