రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌పై కేసు

ఉద్యోగం పేరుతో మోసం చేశాడంటూ బాధితుడి ఫిర్యాదు

నల్లచెరువు, న్యూస్‌టుడే: ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ షేక్‌ కరీముల్లాపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వరలక్ష్మి తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువుకు చెందిన బాధితుడు పఠాన్‌ అబ్దుల్‌ హుసేన్‌ఖాన్‌కు కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్‌ ప్రాంతానికి చెందిన హుసేన్‌ అనే వ్యక్తి ద్వారా వైయస్‌ఆర్‌ జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు, ఏపీ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ షేక్‌ కరీముల్లా పరిచయమయ్యారు. తన సంస్థలో పొరుగుసేవల కింద ఉద్యోగులు ఉన్నాయని నమ్మబలకడంతో అబ్దుల్‌ హుసేన్‌ 2021 డిసెంబరు 31న ఆయన అకౌంట్‌కు రూ.3.80 లక్షలు జమ చేశారు. డబ్బులు చెల్లించి 6నెలలు గడిచినా.. ఉద్యోగం ఇప్పించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు ‘ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అనడంతో కరీముల్లాపై సోమవారం ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts