Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!

ఇంటర్నెట్‌డెస్క్‌: చిలీలో జులై 30వ తేదీన ఒక్కసారిగా పుట్టుకొచ్చిన భారీ గొయ్యి (సింక్‌ హోల్‌) నానాటికీ విస్తరిస్తోంది. తాజాగా 160 అడుగుల వెడల్పు, 656 అడుగుల లోతుకు పెరిగిపోయింది. ఇది ఎంత పెద్దగా ఉందంటే..  ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ ఇందులో సులభంగా ఇమిడిపోతుంది.. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఆర్క్‌ డి ట్రయాంఫ్‌ పూర్తిగా ఈ గొయ్యిలో పట్టగలదు. ఈ మిస్టరీ గొయ్యిపై చిలీకి చెందిన నేషనల్‌ సర్వీస్‌ ఆఫ్‌ జియాలజీ అండ్‌ మైనింగ్‌ విభాగం అధికారులు శనివారం స్పందిస్తూ.. ఇది ఏర్పడటానికి కారణాలను పరిశీలిస్తున్నామన్నారు.

ఈ గొయ్యి ఏర్పడిన ప్రదేశానికి అత్యంత సమీపంలోని అల్కాపరోసా అండర్‌ గ్రౌండ్‌ గనులను కెనడాకు చెందిన కంపెనీ లుండిన్‌ మైనింగ్‌ ఎల్‌యూఎన్‌ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గనిలోని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ గనిలో 80శాతం వాటా కెనడా కంపెనీది కాగా.. మిగిలిన 20శాతం వాటా జపాన్‌కు చెందిన సుమిటోమో మెటల్‌ మైనింగ్‌కు చెందింది. ఇక్కడ అనుమతులకు మించి మైనింగ్‌ జరిగినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లేవని  చిలీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే గనిలో నీటిని తోడే యంత్రాలను చేర్చారు. మరికొద్ది రోజుల్లో గని ఛాంబర్లు ఎక్కడైనా దెబ్బతిన్నాయేమో పరిశీలించనున్నారు. ఈ గొయ్యి కారణంగా భూగర్భ గని.. భవిష్యత్తులో వరదల్లో చిక్కుకోవచ్చని అనుమానిస్తున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని