Bollywood: అతిథి పాత్రలో...!

‘లాల్‌ సింగ్‌ చడ్డా’... ఆమిర్‌ఖాన్‌ తాజా చిత్రం. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో  షారూక్‌ఖాన్‌ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఆమిర్‌. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ముఖ్యనగరాల్లో పర్యటిస్తున్న ఆమిర్‌... ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతంలోనే ఈ చిత్రంలో షారుక్‌ నటిస్తున్నాడనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఇది    నిజమైంది. ‘‘ఇందులో ఓ కీలక పాత్ర కోసం మిత్రుడు షారూక్‌ను కలిశాను. ఆయన చాలా సంతోషంగా అంగీకరించారు. ఇది అతిథి పాత్ర అయినా.. తన స్థాయికి తగినట్లు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు ఆమిర్‌. ఇందులో కరీన్‌ కపూర్‌ కథానాయిక. తెలుగు కథానాయకుడు  నాగచైతన్య మరో ముఖ్య   పాత్రలో మెరవనున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని