‘అందరికీ విద్య’ను ప్రారంభించిన ఆకాశ్‌ బైజూస్‌

నవంబరులో ఏఎన్‌టీహెచ్‌ఈ-2022 నిర్వహించనున్నట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ శిక్షణ సంస్థ ఆకాశ్‌ బైజూస్‌ బాలికా సాధికారిత లక్ష్యంగా ‘అందరికీ విద్య’ కార్యక్రమాన్ని ప్రారభించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలు, ఒక బాలిక కగిన కుటుంబాలు, సింగిల్‌ పేరెంట్‌(మదర్‌)కు దీని ద్వారా తోడ్పాటు అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆకాశ్‌ బైజూస్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పరీక్ష(ఏఎన్‌టీహెచ్‌ఈ)-2022లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. నవంబరు 5నుంచి 13వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా 285 కేంద్రాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా తొమ్మిది నంచి 12వ తరగతి చదువుతున్న సుమారు 2వేల మంది నిరుపేద విద్యార్థినులకు ఉపకారవేతనాలను అందించడంతోపాటు నీట్‌, జేఈఈలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు నాసాకు ఉచితంగా వెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం anthe.aakash.ac.inలో చూడాలని సూచించారు. దేశ వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఇటీవల ‘అందరికీ విద్య’ ప్రారంభ కార్యక్రమం జరిగింది. దిల్లీలో సంస్థ ఛైర్మన్‌ జేసీ చౌదరి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆకాశ్‌ చౌదరి, సీఈవో అభిషేక్‌ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ఆకాశ్‌ చౌదరి మాట్లాడుతూ.. ఆర్థిక కారణాలతో చదువుకు దూరమవుతున్న బాలికలకు చేయూత అందించేందుకే ‘అందరికీ విద్య’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని