నేడు వాయుసేనలోకి ఎల్‌సీహెచ్‌ హెలికాప్టర్లు

దిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) సోమవారం లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరనున్నాయి. అనేక రకాల క్షిపణులు, ఇతర ఆయుధాలను ప్రయోగించగల ఈ లోహవిహంగాల రాకతో మన వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగే ఒక వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరిలు ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెడతారు. ఎల్‌సీహెచ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధి చేసింది. ప్రధానంగా దీన్ని పర్వత ప్రాంతాల్లో మోహరింపుల కోసం రూపొందించారు. 5.8 టన్నుల బరువున్న ఈ హెలికాప్టర్‌లో రెండు ఇంజిన్లు ఉన్నాయి. శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం దీని సొంతం. రాత్రిపూట కూడా ఇది పోరాడగలదు. నేలను బలంగా తాకినా తట్టుకోగల దృఢ ల్యాండింగ్‌ గేర్‌ను దీనికి ఏర్పాటు చేశారు. అన్నిరకాల వాతావరణాల్లోనూ ఇది గగనవిహారం చేయగలదు. గాల్లో అద్భుత విన్యాసాలు చేస్తూ శత్రువును గందరగోళానికి గురిచేస్తుంది.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు