close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పంచదారతో ఇలా

వంటకాలకు తియ్యటి రుచులు అందించే పంచదారని మరి ఇంకెన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో చూద్దామా!
* గోరింటాకు రుబ్బేటప్పుడు రెండు చెంచాల పంచదార వేస్తే చక్కటి రంగు వస్తుంది. లేదా పంచదార, నిమ్మరసం కలుపుకొని చేతికి పెట్టుకున్న గోరింటాకుకి అద్దుతూ ఉంటే...బాగా పండుతుంది.
* పూలవాజుల్లో నీళ్లు మార్చిన ప్రతిసారీ ఆ నీళ్లలో రెండు చెంచాల పంచదార కూడా కలిపితే పూలు వాడిపోకుండా తాజాగా ఉంటాయి. గడ్డిజాతికి చెందిన మొక్కల్ని పెంచేటప్పుడు మొదట్లో కొద్దిగా పంచదారని వేయండి. మొక్కలు ఏపుగా ఎదుగుతాయి.
* దుస్తులపై పడ్డ బురద మరకలు పోవాలంటే...గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా బేకింగ్‌ సోడా, చెంచా పంచదార కలిపి రుద్దితే సరి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు