close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘మాణిక్యాలరావుతో ప్రత్యేక అనుబంధం’

ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్న కృష్ణం రాజు

ముగిసిన మాజీమంత్రి అంత్యక్రియలు

తాడిపల్లిగూడెం: కరోనా కారణంగా మాజీ మంత్రి పి. మాణిక్యాలరావు మరణించారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రెబల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. పార్టీ పరంగానే కాకుండా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మొదలై అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగిన నాయకుడు మాణిక్యాలరావు అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. వారి కుటుంబ సభ్యులకు కృష్ణంరాజు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అధికారిక లాంఛనాలతో మాణిక్యాల రావు అంత్యక్రియలు

అధికారిక లాంఛనాలతో మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు అంత్యక్రియలు జరిగాయి. పోలీసుల గౌరవ వందనం, గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ నిర్వహించారు. తాడేపల్లిగూడెం హిందూ ధర్మ స్మశానవాటికలో నిర్వహించిన అంత్యక్రియల్లో మాణిక్యాలరావు భార్య, కుమార్తె, అల్లుడు, ఇతర బంధువులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు 20 మందికి అధికారులు అనుమతినిచ్చారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు