close

సినిమా

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సర్కారు వారి పాట.. కీర్తి

మహేష్‌బాబు కథానాయకుడిగా  పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, 14రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా  నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో  మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్‌ కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చినా.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కీర్తి పుట్టిన రోజు సందర్భంగా శనివారం దీనిపై మహేష్‌ స్పష్టతనిచ్చారు. ఆయన శనివారం ట్విటర్‌ వేదికగా కీర్తికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ ప్రాజెక్ట్‌లోకి ఆమెకు స్వాగతం పలికారు. ఈ చిత్రం ఆమెకు ఓ మరపురాని చిత్రమవుతుందని తన ట్వీట్‌లో రాసుకొచ్చారాయన. దీనిపై కీర్తి స్పందిస్తూ.. ‘‘తొలిసారి మీతో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని మహేష్‌కు  బదులిచ్చింది. ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. శనివారం కీర్తి పుట్టినరోజును పురస్కరించుకొని ‘రంగ్‌ దే’, ‘గుడ్‌లక్‌ సఖీ’, ‘మిస్‌ ఇండియా’ చిత్ర బృందాలు సైతం ఆమె కొత్త ప్రచార చిత్రాల్ని విడుదల చేశాయి.



మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు