close

తెలంగాణ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రంగు మారె.. మొలకలొచ్చె..

ఈ చిత్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూశారా.. నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన కౌలు రైతులు ఆలూరు గంగామణి, లక్ష్మణ్‌లు వానాకాలంలో మూడున్నర ఎకరాల్లో సన్నాలు సాగు చేశారు. ఎకరాకు రూ.25 వేలు పెట్టుబడి పెట్టారు. పది రోజుల క్రితం కోత కోశారు. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం తెరిస్తే పంట విక్రయిద్దామని ఎదురుచూశారు. అంతలోనే వరుసగా కురిసిన వర్షాలతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రంగు మారడంతో పాటు మొలకలొచ్చాయి. ఎంతో కొంతకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముదామన్నా ఎవరూ కొనడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.          

- న్యూస్‌టుడే, ఎడపల్లి


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు