close

తాజా వార్తలు

ధారావాహికల్లో తెలుగు వారినే తీసుకోవాలి

నార్సింగి, న్యూస్‌టుడే: తెలుగు ధారావాహికల్లో తెలుగు నటీనటులకే అవకాశం కల్పించాలని ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలుగు టెలివిజన్‌ ప్రతినిధులు ‘తెలుగు సీరియళ్లలో-తెలుగు నటీనటులే’ నినాదంతో మంగళవారం వివిధ టెలివిజన్‌ యాజమాన్యాలు, నిర్మాతల కౌన్సిల్‌కు వినతిపత్రాలు అందజేశారు. అవకాశాలు కరవై తెలుగు నటీనటులు పడుతున్న ఇబ్బందులను అసోసియేషన్‌ నాయకులు విజయ్‌యాదవ్‌, లోహిత్‌, భార్గవ్‌ శశాంక్‌, నాగమణి, విజయవాణి, చెన్నుపాటి సుబ్బారావు, క్రిష్ణకిషోర్‌, వాజ్‌పేయి, మురళీ కృష్ణారెడ్డి, బాలాజీ, దీప్తీవాజ్‌పేయి, రామక్రిష్ణ వివరించారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు