close

బిజినెస్‌

ఫ్యూచర్‌ రిటైల్‌లో 8-10% వాటా అమెజాన్‌కు!

దిల్లీ: ఫ్యూచర్‌ రిటైల్‌లో 8- 10 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తుదిదశ చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ రిటైల్‌ వచ్చే కొన్ని వారాల్లో ఈ లావాదేవీ  పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ వార్తలపై స్పందించేందుకు అమెజాన్‌ ఇండియా, ఫ్యూచర్‌ రిటైల్‌లు నిరాకరించాయి. ఈ ఒప్పందం పూర్తయితే.. భారత రిటైల్‌ విపణిలో అమెజాన్‌ బలోపేతం కానుంది. వాటా విక్రయానికి అమెజాన్‌, ఫ్యూచర్‌ రిటైల్‌ల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇ-కామర్స్‌ సంస్థలకు ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో కొన్ని రోజులు చర్చలు నిలిచిపోయాయి. అనంతరం కొన్ని వారాల కింద మళ్లీ ప్రారంభమైన చర్చలు, ఇప్పుడు తుదిదశకు చేరాయని సమాచారం.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు