close

క్రైమ్

జనసేన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్‌

స్టేషన్‌ బెయిల్‌పై విడుదల

మలికిపురం, రాజోలు, న్యూస్‌టుడే: మలికిపురం పోలీస్‌స్టేషన్‌పై దాడి చేశారన్న అభియోగం మేరకు నమోదైన కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గœ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అంతకుముందు మలికిపురం, రాజోలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.  మధ్యాహ్నం ఎమ్మెల్యే రాపాక రాజోలు పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆయన్ను కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధంకాగా, తాను నడిచే వస్తానంటూ ఎమ్మెల్యే స్టేషన్‌ మెట్లపై కూర్చుండిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలను నియంత్రించే క్రమంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగి ఓ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గందరగోళం మధ్య పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా వాహనం ఎక్కించి రాజోలు జూనియర్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ సివిల్‌ జడ్జి రమణారెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేతో పాటు మరో 9మందికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసినట్లు రాజోలు సీఐ నాగమోహన్‌రెడ్డి తెలిపారు.
¸


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు