close

ఆంధ్రప్రదేశ్

అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అధికార భాషా సంఘంలో నలుగురు సభ్యులను నియమించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తెలుగు భాషావినియోగం, ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వరంగ సంస్థల్లో తెలుగు వినియోగంపై తనిఖీలు చేసి, ఆదేశాలు ఇచ్చే అధికారం అధికార భాషా సంఘానికి ఉంటుంది. ప్రధాని మోదీ ఛైర్మన్‌గా ఉన్న కేంద్రీయ హిందీ సంస్థలో యార్లగడ్డ సభ్యునిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు