close

తెలంగాణ

హైదరాబాద్‌పై మాంద్యం ప్రభావం లేదు

క్రెడాయ్‌ తెలంగాణ తొలి ఛైర్మన్‌ రాంరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో స్థిరాస్తి మార్కెట్‌పై ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రస్తుతానికి లేదని రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ శాఖకు కొత్తగా ఎన్నికైన తొలి ఛైర్మన్‌ జి.రాంరెడ్డి అన్నారు. దేశంలోని ముఖ్య నగరాలతో పోలిస్తే ఇప్పటికీ ధరలు అందుబాటులో ఉండటంతో అందరూ హైదరాబాద్‌ వైపు చూస్తున్నారని చెప్పారు. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు హైదరాబాద్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మాంద్యం ప్రభావం పడే ఆస్కారం ఉన్నందున ఇప్పటినుంచే జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 14 నెలలుగా పలు స్థిరాస్తి ప్రాజక్టులకు పర్యావరణ అనుమతులు రాలేదని, వెంటనే ఇచ్చేలా  చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ రామచంద్రారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రెడాయ్‌ ఉపాధ్యక్షులుగా కె.ఇంద్రసేనారెడ్డి, జగన్‌మోహన్‌, అజయ్‌కుమార్‌, వి.మధుసూదన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా వై.సైదేశ్వరరావు, గోపాల్‌ పంచారియా, పి.రాజయ్య, కోశాధికారిగా బి.పాండురంగారెడ్డి వ్యవహరిస్తారు. ఈ పదవుల్లో వీరు 2021 వరకు కొనసాగుతారు. కాగా ఈసారి కొత్తగా ఛైర్మన్‌ను ఎన్నుకున్నారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు