close

గ్రేటర్‌ హైదరాబాద్‌

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌తో దేశభక్తి, క్రమశిక్షణ

వ్యవస్థాపక దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

కవాడిగూడ, న్యూస్‌టుడే: దేశభక్తి, క్రమశిక్షణను అలవర్చే స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఉద్యమంలో విద్యార్థులు చేరాలని రాష్ట్ర గవర్నర్‌, తెలంగాణ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అధ్యక్షురాలు, ప్యాట్రన్‌ తమిళిసై పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌ దోమలగూడలోని మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన స్కౌట్్స అండ్‌ గైడ్స్‌ వ్యవస్థాపక దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో తానుసైతం గైడ్స్‌ ఉద్యమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 20 మంది విద్యార్థులకు రాజ్య పురస్కారాలను ప్రదానం చేశారు. పీయర్స్‌ సంస్థ నిర్వాహకుడు అస్లాంబిన్‌ అందించిన రూ.10 లక్షల విరాళాన్ని స్వీకరించి సంబంధిత అధికారులకు అందజేశారు. వచ్చే ఏడాదికల్లా 50,000మంది విద్యార్థులను ఉద్యమంలో చేర్చాలని లక్ష్యంగా విధించుకున్నట్లు స్కౌట్్స అండ్‌ గైడ్స్‌ తెలంగాణ చీఫ్‌ కమిషనర్‌ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గత రెండేళ్లుగా చేపట్టిన కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో గవర్నర్‌ తమిళిసై, కల్వకుంట్ల కవిత మొక్కలునాటారు. స్కౌట్్స అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, సంయుక్త కార్యదర్శి మంచాల వరలక్ష్మి పాల్గొన్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు