close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూజీసీ ఫైనల్‌ పరీక్షల రద్దుపై మధ్యంతర ఉత్తర్వులకు ‘సుప్రీం’ నిరాకరణ

దిల్లీ: విశ్వవిద్యాలయాల ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ పరీక్షల రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను ఆగస్టు 10కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్ధుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, అందువల్ల పరీక్షలు నిర్వహించాలంటూ యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలంటూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. పరీక్షలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అభిప్రాయం కూడా తీసుకుంటామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. బిహార్‌, అసోంల్లో వరదల కారణంగా విద్యార్ధుల చాలా ఇబ్బందులు పాలవుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది అలోక్‌ శ్రీవాస్తవ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సమయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని.. తిరిగి ఈ కేసును ఆగస్టు 10న విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు