close

తాజా వార్తలు

పోటీ 200వ సారి!

న్యూస్‌టుడే, చెన్నై: వృత్తిరీత్యా పంక్చర్‌ దుకాణం నిర్వహిస్తూంటారాయన... తనకంటూ గుర్తింపు తెచ్చుకోకపోతే ఎలాగబ్బా... అని ఆలోచనల్ని మథించారు... ఏ ఎన్నికలైనా సరే... నామినేషన్‌ దాఖలు చేసి... పోటీపడటం ఆనవాయితీగా చేసుకున్నారు. గెలుపు రాలేదు కానీ గుర్తింపు దక్కింది.

తమిళనాడులోని సేలం జిల్లా కుంజాండియూర్‌ వాసి కె.పద్మరాజన్‌. వయసు 62 ఏళ్లు. ఎన్నికలొచ్చేశాయంటే ఏదో ఒకస్థానం నుంచి నామినేషన్‌ వేసేస్తారు. 1986 నుంచి అదేపని. కరుణానిధి మృతితో తిరువారూర్‌ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు ప్రకటించగా... నామినేషన్‌ వేశారు. తద్వారా 199వ సారి ఎన్నికల్లో పోటీకి దిగినట్లయింది. ఏ ఒక్కసారీ డిపాజిట్‌ దక్కకపోవడం గమనార్హం. 2011లో తమిళనాడు అసెంబ్లీ పోరులో మేట్టూరు స్థానం నుంచి పోటీ చేసినప్పుడు పద్మరాజన్‌కు అత్యధికంగా 6,273 ఓట్లు లభించాయి. ఈసారీ నామినేషన్‌ వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటక, దిల్లీల్లో జరిగిన పలు ఎన్నికల్లో వివిధ స్థానాల నుంచి రంగంలోకి దిగారు. 2014లో నరేంద్రమోదీపై పోటీ చేయాలని భావించారు. సరైన వివరాలు లేవని మనోడి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. నలుగురు ప్రధానులు, 11 మంది ముఖ్యమంత్రులపై పోటీ చేసిన రికార్డు ఉంది. ఎక్కువసార్లు పోటీకి దిగిన వ్యక్తిగా, పరాజయాలు పొందిన అభ్యర్థిగా ఈయన పేరును ఇప్పటికే లిమ్కాబుక్‌ రికార్డ్స్‌ వాళ్లు నమోదు చేసేశారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు