close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
కృత్రిమ కాలుతోనే సాహసం

ఎవరెస్టు అధిరోహించిన మొదటి దివ్యాంగురాలు - అరుణిమా సిన్హా

త్యంత ఎత్తైన పర్వతశ్రేణిని చేరుకోవాలనే లక్ష్యం ఆమెను ప్రపంచస్థాయిలో నిలిపింది. ఆమే అరుణిమా సిన్హా. ఆరేళ్లక్రితం ఎవరెస్టు పర్వతం ఎక్కిన తొలి దివ్యాంగురాలిగా ప్రపంచ రికార్డును సాధించింది. ఈ ఏడాది జనవరిలో అతి ఎత్తైన అంటార్కిటికాను చేరుకుని మరొక రికార్డును సొంతం చేసుకుంది. అరుణిమది ఉత్తరప్రదేశ్‌. 2011లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటన ఆమె జీవితాన్నే మార్చేసింది. ఓ రోజు దిల్లీకి వెళ్లడానికి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది. అనుకోకుండా కొందరు దుండగులు వేగంగా వెళుతున్న రైల్లోకి ప్రవేశించి, ప్రయాణికులను దోచుకుంటుంటే, వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆమెను రైల్లోంచి గెంటేశారు. ఆ ప్రమాదంలో అరుణిమ రైలు పట్టాలపై పడిపోవడం, వెంటనే మరో రైలు ఆమె ఉన్న పట్టాలపైకి దూసుకురావడంతో తీవ్రంగా గాయలపాలైంది. ఒక కాలు బాగా దెబ్బతినడంతో వైద్యులు తొలగించారు. కొన్ని నెలలు మంచానికే పరిమితమైంది. ఆ సమయంలో ఆమె పరిస్థితిని గుర్తించిన ఓ ప్రైవేటు సంస్థ ఆమెకు కృత్రిమ కాలును అందించింది. రైల్వేవిభాగం ఉద్యోగాన్నిచ్చింది. ఆమె తనలాంటివారికి స్ఫూర్తిగా నిలవాలనుకుంది. అందుకే కష్టమైనా ఎవరెస్టు పర్వతం ఎక్కి తొలి దివ్యాంగురాలిగా ప్రపంచరికార్డును సాధించింది. ఆఫ్రికాలోని కిలిమంజారో, యూరప్‌లోని ఎల్‌బ్రూస్‌ వంటివి చేరుకోవడమే కాదు... వీటి ఎత్తులను కొలిచి, మరో రికార్డును సొంతం చేసుకుంది. పద్మశ్రీ గ్రహీత అయ్యింది. ప్రధాని ప్రశంసలను సైతం అందుకుంది.


మరిన్ని