బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 12:09 IST

ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు జగన్‌?: చంద్రబాబు

అమరావతి: మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే.. అందులో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని  ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి, ఓట్లు అడుగుతారని నిలదీశారు. గత మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్(ట్విటర్‌) ఖాతాలో విడుదల చేశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని