icon icon icon
icon icon icon

ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్‌?: చంద్రబాబు

మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా గౌరవం ఉంటే..

Updated : 27 Apr 2024 19:59 IST

అమరావతి: మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే.. అందులో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని  ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి, ఓట్లు అడుగుతారని నిలదీశారు. గత మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్(ట్విటర్‌) ఖాతాలో విడుదల చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img