ఐపీఓకు రానున్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ - Aditya Birla Sun Life AMC files for IPO
close

Published : 20/04/2021 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐపీఓకు రానున్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ

ముంబయి: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ లిమిటెడ్‌ (ఏబీఎస్‌ఎల్‌ఏఎంసీ) పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు సోమవారం సెబీకి దరఖాస్తు చేసుకుంది. ఏబీఎస్‌ఎల్‌ఏఎంసీలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు ఉన్న వాటాల్లో 2.9 మిలియన్‌ షేర్లు, సన్‌ లైఫ్‌(ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఉన్న వాటాల్లో 36 మిలియన్‌ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయించనున్నారు. ఈ రెండింటి వాటాలు కలిపితే ఏబీఎస్‌ఎల్‌ఏఎంసీలో 13.50 శాతం పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ అవుతుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌, సన్‌ లైఫ్‌ ఫినాన్షియల్‌, కెనడా మధ్య ఏర్పడ్డ జాయింట్‌ వెంచరే ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ. ఈ సంస్థలో ఆదిత్య బిర్లాకు 51 శాతం వాటాలుండగా.. మిగిలిన 49 శాతం వాటాలు సన్‌ లైఫ్‌ చేతిలో ఉన్నాయి. షేర్ల ధరల శ్రేణి, సబ్‌స్క్రిప్షన్‌ తేదీ, లిస్టింగ్‌ తేదీ, ఐపీఓ ద్వారా ఎంత మొత్తం సమీకరించనున్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని