ఆరోగ్య బీమా ప్రీమియం - ఏ పాల‌సీకి ఎంత‌? - Buying-a-Rs-5-lakh-health-insurance-plan
close

Published : 17/07/2021 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమా ప్రీమియం - ఏ పాల‌సీకి ఎంత‌?

ఆరోగ్య బీమాను ఎంపిక చేసుకునేట‌ప్పుడు మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక వేసుకోవాలి. త‌గినంత ఆరోగ్య బీమా ర‌క్ష‌ణ‌ను క‌లిగి ఉండ‌టం ప్ర‌తి ఒక్క‌రి ఎజెండాలో ఉండాలి. కోవిడ్ ప‌రిస్థితుల‌తో చాలా మంది ఆర్థిక అవ‌స‌రాలలో పెను మార్పులు వ‌చ్చాయి. కోవిడ్ మ‌హ‌మ్మారితో ఆరోగ్య బీమా అవ‌స‌రం కూడా చాలా పెరిగింది. ఇంటిలో ఎవ‌రికైనా ఆసుప‌త్రి చికిత్స అవ‌స‌ర‌మైతే వైద్య ఖ‌ర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. స‌మ‌గ్ర ఆరోగ్య బీమా క‌వ‌ర్ మీ కుటుంబ ఆర్థిక ప‌రిస్థితుల‌ను కాపాడుతుంది. ఆరోగ్య బీమా నిపుణులు క‌నీసం రూ. 5 ల‌క్ష‌ల నుండి రూ. 10 ల‌క్ష‌ల బీమాతో ఒక వ్య‌క్తి లేదా కుటుంబ ఫ్లోట‌ర్ పాల‌సీని క‌లిగి ఉండాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు. కంపెనీలో గ్రూప్‌గా ఆరోగ్య బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పించినా కూడా విడిగా ఇంకొక పాల‌సీ తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కంపెనీలో ఉద్యోగం మానివేసినా, కోల్పోయిన, రిటైరైన కూడా విడిగా తీసుకున్న పాల‌సీని కొన‌సాగించ‌వ‌చ్చ‌ని నిపుణుల అభిప్రాయం. వ‌య‌సు దాటిన త‌ర్వాత అప్ప‌టిక‌ప్పుడు పాల‌సీ అందుబాటులో లేకపోవ‌చ్చు. ప్రీమియం ఎక్కువ ఉండ‌వ‌చ్చు. అందుచేత ఉద్యోగంలో ఉండ‌గానే అద‌న‌పు పాల‌సీని తీసుకోవ‌డం అవ‌స‌రం. దానిని ఎక్కువ సంవ‌త్స‌రాలు కొన‌సాగించ‌వ‌చ్చు.

పాల‌సీ తీసుకునేట‌ప్పుడు పాల‌సీ ఫీచ‌ర్లు, ప్రీ-హాస్పిట‌లైజేష‌న్ క‌వ‌ర్‌, తీవ్ర‌ అనారోగ్య ర‌క్ష‌ణ‌, నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల జాబితా, మిన‌హాయింపులు, ఉప ప‌రిమితులు, చికిత్స‌కు వేచి ఉండే కాలం, క్లెయిమ్ బోన‌స్ సౌక‌ర్యం, అంబులెన్స్ క‌వ‌ర్ వంటి యాడ్‌-ఆన్ ప్ర‌యోజ‌నాలు, రైడ‌ర్‌ల కోసం చెక్ చేసుకోవాలి. మీరు ఎంచుకున్న బీమా నిబంధ‌న‌లు, ష‌ర‌తులను బ‌ట్టి కొన్ని ప్ర‌యోజ‌నాలు యాడ్‌-ఆన్ ప్రాతిప‌దిక‌న ల‌భిస్తాయ‌ని గుర్తుంచుకోండి. మీ అవ‌స‌రాల ఆధారంగా పాల‌సీలో కొంచెం ఎక్కువ ప్రీమియం ఉన్న‌ప్ప‌టికీ త‌గిన పాల‌సీనే తీసుకోవాలి. అయితే, ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకునేట‌ప్పుడు ప్రీమియం ఖ‌ర్చు మాత్ర‌మే ప్ర‌మాణం కాకూడ‌దు. ఒక నిర్దిష్ట ప్ర‌ణాళిక‌ను ఎంచుకునేట‌ప్పుడు మీరు బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్‌, ట్రాక్ రికార్డ్‌, క్లెయిమ్ ప్రాసెసింగ్ సౌల‌భ్యం మొద‌లైన వాటిపై కూడా దృష్టి పెట్టాలి.

30 సంవ‌త్స‌రాల వ్య‌క్తికి, రూ. 5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమాకు ఒక సంవ‌త్స‌రానికి ప్రీమియంలు కింద ఉన్నాయి.

ఈ ప్రీమియంలు జులై 13, 2021 నాటికి అమ‌లులో ఉన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని