Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు - Gold declines Rs 464 silver cracks Rs 723
close

Published : 14/06/2021 19:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Gold Rate: తగ్గిన బంగారం, వెండి ధరలు

దిల్లీ: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత శుక్రవారం రూ.441 మేర పెరిగిన బంగారం ధర సోమవారం అదేస్థాయిలో తగ్గింది. దేశ రాజధాని నగరం దిల్లీలో రూ.464లు తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,705కి చేరింది. క్రితం ట్రేడింగ్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,169గా ఉంది.

మరోవైపు, వెండి కూడా పసిడి బాటలోనే పయనించింది. కిలో వెండి ధరపై రూ.723లు తగ్గడంతో ప్రస్తుతం రూ.71,143 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ విలువ బలపడటం, అంతర్జాతీయ పసిడి మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఈ హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1858 డాలర్లుగా ఉండగా.. ఔన్సు వెండి ధర 27.70డాలర్లుగా ట్రేడ్‌ అవుతోంది. ఇకపోతే, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.49,760కి (అన్ని ట్యాక్స్‌లతో కలిపి) పైగా  పైగా ట్రేడ్‌ అవుతోంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని