2024-25 నాటికి 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ: హర్దీప్‌సింగ్‌ పూరి - India poised to become USD 5-trillion economy by 2024-25 says Puri
close

Published : 21/10/2021 21:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2024-25 నాటికి 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ: హర్దీప్‌సింగ్‌ పూరి

దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడి మళ్లీ పరుగులు పెడుతోందని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి అన్నారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థను భారత్‌ అందుకుంటుందని చెప్పారు. 2030 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు పీఏఎఫ్‌ఐ నిర్వహించిన సదస్సులో గురువారం వర్చువల్‌గా ఆయన మాట్లాడారు.

బీపీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఈ సందర్భంగా హర్దీప్‌సింగ్‌ పూరి చెప్పారు. ఎయిరిండియా ప్రైవేటీకరణను కొనియాడారు. దేశంలో పెట్రోల్‌ వినియోగం పెరిగిందని, కొవిడ్‌ ముందునాటితో పోలిస్తే ఇప్పుడు 16 శాతం అధికంగా వినియోగం జరుగుతోందన్నారు. అలాగే, డీజిల్‌ వినియోగం కూడా 10-12 శాతం మేర పెరిగిందని చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌ సైతం 2020 మార్చితో పోలిస్తే 250 శాతం వృద్ధి కనిపిస్తోందన్నారు.

దేశీయంగా అధిక పెట్రోల్‌, డీజిల్‌ ధరలపైనా మంత్రి స్పందించారు. పెట్రోల్‌, డీజిల్‌ సప్లయ్‌ కన్నా డిమాండ్‌ అధికంగా ఉండడమే వీటి ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తే వీటి ధరలకు అడ్డుకట్ట వేయొచ్చని హర్దీప్‌సింగ్‌ పూరి అన్నారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని