పెరిగిన వంట గ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగం - LPG-consumption-amongst-PMUY-customers-surge-23pecent-despite-price-rise
close

Updated : 11/03/2021 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెరిగిన వంట గ్యాస్ (ఎల్‌పీజీ) వినియోగం

ధ‌ర‌ల పెరుగుద‌ల ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి  ఉజ్వల యోజ‌న (పీఎంయువై) క‌స్ట‌మ‌ర్ల‌లో ‘ఎల్‌పీజీ’ వినియోగం 23.2% పెరిగింద‌ని ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్) నివేదికలో తెలిపింది. గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే, మొత్తం దేశీయ ఎల్‌పీజీ అమ్మ‌కాలు ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో (ఫిబ్ర‌వ‌రి 21 వ‌ర‌కు) 10.3% వృద్ధిని న‌మోదు చేశాయ‌ని ‘ఐఓసీఎల్‌’ ప్రకటించింది.

ఎల్‌పీజీ ధ‌ర‌లు ఇటీవ‌ల బాగా పెరిగిన‌ప్ప‌టికీ, ప్ర‌ధాన మంత్రి ఉజ్వల యోజ‌న (పీఎంయువై) వినియోగ‌దారుల‌లో ద్ర‌వీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండ‌ర్ల వినియోగం మెరుగుప‌డింది. ఐఓసీఎల్ నివేదిక ప్ర‌కారం, ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభ త్రైమాసికంలో ఎల్‌పీజీ వినియోగంలో 23.2% పెరుగుద‌ల ఉంది. దీనికి ‘పీఎంయువై’ ల‌బ్ధిదారుల‌కు ఇచ్చిన 3 ఉచిత ఎల్‌పీజీ రీఫిల్స్ కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

కేంద్ర ప్ర‌భుత్వం పేద‌ల‌కు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాల‌నే ఉద్దేశంతో `పీఎంయువై` స్కీమ్‌లో 8 కోట్ల `ఎల్‌పీజీ` క‌నెక్ష‌న్ల‌ను రూ. 12,800 కోట్ల ప్ర‌భుత్వ వ్య‌యంతో దేశ‌మంతా ల‌బ్ధిదారుల‌కు అంద‌జేసింది. అంతేకాకుండా, కొవిడ్ -19 స‌మ‌యంలో అట్ట‌డుగు స్థాయిలో ఉన్న వారి స‌మ‌స్య‌ల‌ను గుర్తించి ‘పీఎంయువై’ ల‌బ్ధిదారుల‌కు 3 ఉచిత ఎల్‌పీజీ రీఫిల్స్ అందించారు. మొత్తం రూ.9,670 కోట్లు ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల‌కు నేరుగా బ‌దిలీ అయ్యాయి. లాక్‌డౌన్ కాలంలో 8 కోట్ల మంది ల‌బ్ధిదారులు ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న ద్వారా 14 కోట్ల ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా పొందారు.

అయితే ‘పీఎంయువై’ ల‌బ్ధిదారుల‌లో 70% మందే త‌మ ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను రీఫిల్ చేసుకుంటున్నారు. మిగ‌తావారు ఇంకా వంట‌కు బ‌య‌ట వ‌న‌రుల మీదే ఆధార‌ప‌డుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని