నష్టాల్లో స్టాక్ మార్కెట్లు - Markets are in red
close

Published : 24/03/2021 09:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 49,786, వద్ద, నిఫ్టీ 14,712 వద్ద ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:38 గంటల సమయానికి సెన్సెక్స్‌ 246 పాయింట్లు నష్టపోయి 49,805 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 86 పాయింట్లు దిగజారి 14,728 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.54 వద్ద కొనసాగుతోంది.  

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి నుంచి సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు సైతం ఒడుదొడుకుల్లో కదలాడుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్యూచర్‌ దాదాపు 40 పాయింట్ల  దిగువన ట్రేడయ్యింది. వీటితో పాటు దేశీయంగా కీలక కంపెనీల షేర్లు ఒత్తిడి ఎదుర్కొంటుండడం సూచీలను కలవరపెడుతోంది.

విద్యుత్తు, యుటిలిటీస్‌, హెల్త్‌కేర్‌ మినహా దాదాపు దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని