మ్యూచువల్‌ ఫండ్లను ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుందాం - Mutual-Funds-should-be-a-part-of-financial-planning
close

Published : 17/04/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మ్యూచువల్‌ ఫండ్లను ఆర్థిక ప్రణాళికలో భాగం చేసుకుందాం

పొదుపు చేయడం ఒక్కటే సరిపోదు. మంచి రాబడి పొందేందుకు పొదుపుచేసిన సొమ్మును పెట్టుబడిగా పెట్టాలి. పెట్టుబడి పెట్టి ఖాళీగా కూర్చోవడం వల్ల అనుకున్న ప్రయోజనాన్ని పొందలేం.

దేనికోసం పెట్టుబడి పెడుతున్నామో తెలుసుకోండి:
వివిధ రకాల అవసరాలకు మనం పెట్టుబడి లక్ష్యాలను నిర్దేశించుకుంటాం… అవి

* పిల్లల ఉన్నత చదువులకు
* వాళ్ల పెళ్లి ఖర్చులకు
* పదవీ విరమణ తరవాత అవసరాలకు
* సొంత ఇల్లు కొనుక్కునేందుకు
* వారసులకు అందించేందుకు
* సేవా కార్యక్రమాల కోసం
* కారు కొనుక్కునేందుకు
* పర్యాటక ప్రదేశాలను చూసేందుకు
* అత్యవసర నిధిగా…
*స్నేహితులకో, దగ్గరి బంధువులకో బంగారు ఆభరణాలు కొనేందుకు

లక్ష్యాల ప్రాధాన్యతలను తెలుసుకోవడం:
సమయాన్ని, ప్రాధాన్యతను బట్టి లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి. కొన్ని లక్ష్యాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. వాటిని కాస్త నిర్లక్ష్యం చేసినా భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం పెట్టుబడి లక్ష్యాలను విస్మరిస్తే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల ఉన్నత చదువుల విషయంలో రాజీపడలేం కానీ ఖరీదైన ఇల్లు కొనడమో, పెద్ద కారు లేదా ఖరీదైన బహుమతులు కొనడంలో కాస్త తగ్గవచ్చు.

లక్ష్యం నెరవేర్చుకునేందుకు సమయం:
ఈ లక్ష్యాలను స్వల్పకాల, మధ్యస్థ, దీర్ఘకాల లక్ష్యాలుగా విభజించుకోవాలి.

స్వల్ప కాల లక్ష్యాలు: రెండేళ్లలోపు పూర్తి చేయాల్సిన లక్ష్యాలు ఇవి
మధ్యస్థ కాల లక్ష్యాలు: రెండు నుంచి అయిదేళ్ల మధ్యకాలంలో పూర్తిచేయాల్సినవి
దీర్ఘకాల లక్ష్యాలు: అయిదేళ్లకు మించి పూర్తి చేయాల్సిన లక్ష్యాలు
సాధ్యమయ్యే లక్ష్యాలనే ఎంచుకోవాలి. సాధ్యం కానివి లక్ష్యాలుగా ఎంచుకొని తర్వాత అవి తీరకపోతే బాధ, చిరాకు తెచ్చుకోవడం వృధా ప్రయాసే.

ద్రవ్య విధానంలో లక్ష్యాల నిర్దేశం:
ప్రతి లక్ష్యానికి ద్రవ్య రూపంలో ఎంత మొత్తం అవుతుందో అంచనా వేసుకోగలగాలి. లక్ష్యసాధనకు భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత మొత్తానికి అవుతుంది? అంత మొత్తం సముపార్జించేందుకు ఈ రోజు నుంచి ఎంత పొదుపు చేయాలి ఎంత శాతం రాబడి ఆశించవచ్చు? అనే ప్ర‌శ్న‌లు వేసుకొని వాటికి స‌మాధానాలు వెత‌కాలి.
ఇంతవరకూ తెలుసుకున్న అంశాలతో పొదుపు − మదుపు ఎందుకు చేయాలో … లక్ష్యాల ప్రాథ‌మ్యాలేమిటో… లక్ష్యసాధనకు సమయాన్ని కేటాయించే విధానం, లక్ష్యానికి ఎంత మేర పెట్టుబడి కేటాయించుకోవాలి అనే అంశాలపై స్పష్టత వచ్చినట్టే.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని