ఇండియన్‌ ఆయిల్‌ బంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఫాస్ట్‌ట్యాగ్‌తోనూ చెల్లింపులు - Payments with ICICI Bank FastTag at Indian Oil Banks
close

Published : 20/07/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండియన్‌ ఆయిల్‌ బంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు ఫాస్ట్‌ట్యాగ్‌తోనూ చెల్లింపులు

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఆయిల్‌ బంకుల్లో పెట్రోలు, డీజిల్‌, సర్వో లూబ్రికెంట్లు కొనుగోలు చేసి, ఐసీఐసీఐ బ్యాంకు ఫాస్ట్‌ట్యాగ్‌తో కూడా చెలింపులు చేయొచ్చు. పూర్తిగా కాంటాక్ట్‌టెస్‌, క్యాష్‌లెస్‌ పద్ధతిలో లావాదేవీ పూర్తిచేసేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఐసిఐసిఐ బ్యాంకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మొదటి దశలో దేశవ్యాప్తంగా 3,000 ఇండియన్‌ ఆయిల్‌ బంకుల్లో ఈ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించారు. ‘డిజిటల్‌ ఇండియా’ దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య పేర్కొన్నారు.


ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచీ పేటీఎమ్‌ చెల్లింపులు
ఇండస్‌ఇండ్‌ బ్యాంకుతో భాగస్వామ్యం

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎమ్‌ తన పేమెంట్స్‌ బ్యాంక్‌ వినియోగదార్లకు సరికొత్త సేవలు మొదలుపెట్టింది. భాగస్వామ్య బ్యాంకు అయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచీ వినియోగదార్లు చెల్లింపులు చేసే వెసులుబాటు తీసుకొచ్చింది. ఇందు కోసం వినియోగదార్లు ఇండస్‌ఇండ్‌ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను తెరవడానికీ వీలు కల్పించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చెల్లింపుల వనరుగా వినియోగించడం ఇదే తొలిసారని.. దీని వల్ల వినియోగదార్లకు గొప్ప వెసులుబాటు కలిగినట్లేనని పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రతినిధి పేర్కొన్నారు.


క్రెడెన్క్‌లో సీఐఎఫ్‌ఎల్‌ పెట్టుబడులు

ముంబయి: విద్యారుణాలనిచ్చే సంస్థ క్రెడెన్క్‌లో 25 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.187 కోట్లు)ను జొప్పించనున్నట్లు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ క్యాపిటల్‌ ఇండియన్‌ ఫైనాన్స్‌(సీఐఎఫ్‌ఎల్‌) ప్రకటించింది. ఈ నిధులు డెట్‌, ఈక్విటీ రూపంలో ఉంటాయి. 2021-22లో రూ.100 కోట్ల మేర విద్యార్థులకు రుణాలివ్వాలని కంపెనీ భావిస్తోంది. తాజా పెట్టుబడులతో 2025 కల్లా రూ.3,000 కోట్ల రుణ పుస్తకాన్ని తయారు చేసుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.  2017లో ఏర్పాటైన క్రెడెన్క్‌ 17 నగరాల్లోని 1000కి పైగా కళాశాలలకు చెందిన విద్యార్థులకు రుణాలిచ్చింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని