close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేజీ-డీ6 వివాదంలో రూ.3,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

దిల్లీ: ఆమోదించిన పెట్టుబడి ప్రణాళికను పాటించడంలో విఫలమై, కేజీ-డీ6 క్షేత్రంలో సామర్థ్యాన్ని తక్కువగా వినియోగించుకున్నారన్న ఆరోపణలతో గత తొమ్మిదేళ్లుగా కొనసాగుతున్న వివాదంలో గరిష్ఠంగా 400 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3,000 కోట్లు) చెల్లించాల్సి రావొచ్చని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అంచనా వేస్తోంది. వివరాల్లోకి వెళితే, కేజీ-డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్‌-1, 3 సహజ వాయువు క్షేత్రాల నుంచి 2010లో ఆర్‌ఐఎల్‌ ఉత్పత్తి ప్రారంభించగా, రెండో ఏడాది నుంచే దాని ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది. ముందస్తుగా అంచనా వేసిన కాలం కంటే చాలా ముందుగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసింది. కంపెనీ ఆమోదించిన అభివృద్ధి ప్రణాళికకు కట్టుబడి లేదనే ఆరోపణలతో, 3 బిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.22,500 కోట్లు) వ్యయాలను ప్రభుత్వం అనుమతించలేదు. దీనిపై ఆర్‌ఐఎల్‌ ప్రభుత్వంపై మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, ఇటీవల భారీ రైట్్స ఇష్యూకు వచ్చిన ఆర్‌ఐఎల్‌ తమ ఆఫర్‌ డాక్యుమెంట్‌లో కేజీ-డీ6 బ్లాక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు, తమ భాగస్వాములకు పంపిన నోటీసులను ప్రస్తావించింది. అభివృద్ధి ప్రణాళిక ప్రకారం కాకుండా, తక్కువ సామర్థ్యం వినియోగించుకున్నామనే ఆరోపణతో, వ్యయాల రికవరీకి ప్రభుత్వం అనుమతించలేదని, అలాగే లాభంలో అదనపు వాటాను డిమాండ్‌ చేసిందని అందులో తెలిపింది. అయితే తక్కువ సామర్థ్య వినియోగం సాకు చూపి కేంద్ర ప్రభుత్వం వ్యయాల రికవరీని అనుమతించకపోవచ్చని ఒప్పందంలో ఎక్కడా లేదని ఆర్‌ఐఎల్‌ వెల్లడించింది. ఉత్పత్తి పంచుకోవడం కాంట్రాక్ట్‌-పీఎస్‌సీ కింద కాంట్రాక్టర్లు తమ మూలధనం, నిర్వహణ వ్యయాలను తీసివేసిన తర్వాతే లాభాలను పంచుకుంటారని తెలిపింది. అయితే ప్రభుత్వం అలా కాకుండా వ్యయాల రివకరీకి అనుమతించకపోగా, అధిక లాభాలను పంచాలని కోరడంతో 2011 నవంబరు 23న ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్‌ నోటీసు పంపించామని వివరించింది. త్రిసభ్య ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ఎదుట ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. బహుశా తుది వాదనలు 2021 సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యలో ఉండొచ్చని తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం అదనంగా ప్రభుత్వానికి లాభాల్లో వాటా చెల్లించాలని ఆదేశించినా 200-400 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1,500-3,000 కోట్లు) మధ్య ఉండొచ్చని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.