బ్యాంకు లాకర్లపై 6నెలల్లో మార్గదర్శకాలివ్వండి - SC directs RBI to lay down regulations in six months for locker facility
close

Published : 20/02/2021 12:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకు లాకర్లపై 6నెలల్లో మార్గదర్శకాలివ్వండి

ఆర్‌బీఐకి సుప్రీం ఆదేశాలు

దిల్లీ: లాకర్ల నిర్వహణలో బ్యాంకులు నామమాత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని.. ఆరు నెలల్లోగా దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కు సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాకరు సదుపాయాల నిర్వహణలో బ్యాంకులు తీసుకునే తప్పనిసరి చర్యలను అందులో పేర్కొనాలని తెలిపింది. ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో చాలా మంది తమ ఆస్తులను తమతో ఉంచుకోవడానికి సంకోచిస్తున్నారు. దీంతో లాకర్ల సేవలకు గిరాకీ పెరుగుతోంది. ప్రతి బ్యాంకూ తప్పనిసరిగా అందివ్వాల్సిన సేవగా ఇది మారింద’ని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎం. శాంతనగౌడర్, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

చేతులు కడిగేసుకుంటే కుదరదు... 

‘సాంకేతికత పెరుగుతున్నందున తాళాలతో నిర్వహించే లాకర్ల నుంచి ఎలక్ట్రానిక్‌ లాకర్ల వైపు మనం మారుతున్నాం. అయితే సాంకేతికతను దుర్వినియోగం చేసి వినియోగదార్లకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా లాకర్లను తెరిచే అవకాశమూ లేకపోలేదు. బ్యాంకును పూర్తిగా విశ్వసించే ఖాతదార్లు తమ ఆస్తులను లాకర్లలో ఉంచుతారు. కాబట్టి బ్యాంకులు తమకు సంబంధం లేదన్నట్లు ఈ విషయంలో చేతులు కడిగేసుకుంటే కుదరద’ని కోర్టు తేల్చిచెప్పింది. ‘బ్యాంకులు అలా చేస్తే వినియోగదారు రక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అంతే కాదు.. వినియోగదార్ల విశ్వాసం దెబ్బతింటుంది. అది వర్థమాన ఆర్థిక వ్యవస్థ అయిన మన ప్రతిష్ఠకే భంగమ’ని పేర్కొంది. లాకర్లలో ఉన్న వస్తువులు పోయినా.. లేదా దెబ్బతిన్నా బ్యాంకుల బాధ్యత ఏమిటన్న విషయంలో సరైన నిబంధనలను ఆర్‌బీఐ జారీ చేయాలనీ సుప్రీం తెలిపింది.

ఇవీ చదవండి...
బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి

ఆన్‌లైన్‌లో సిప్ ఎలా ప్రారంభించాలి?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని