భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు - Sensex surges 500 pts
close

Updated : 25/02/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ లాభాల్లో మార్కెట్‌ సూచీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 544 పాయింట్ల లాభంతో 51,326 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 15,149 వద్ద ట్రేడవుతున్నాయి. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, హింద్‌కాపర్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర షేర్లు లాభాల్లో ఉండగా.. ఏషియన్‌ గ్రానైటో ఇండియా, ఎలాంటస్‌ బెక్‌ ఇండియా, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, పాలీమెడీ క్యూర్‌ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. 

అంతర్జాతీయ పరిణామాలు, ఫిబ్రవరి డెరివేటీవ్స్‌ ముగింపు వంటి కారణాలతో సూచీలు 1శాతం వరకు లబ్ధిపొందాయి.  మ్యాక్స్‌లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌లో వాటాల యాక్సెస్‌ బ్యాంక్‌కు ఐఆర్‌డీఏఐ అనుమతి రావడంతో మ్యాక్స్‌ షేర్లు 12శాతం వరకు పెరిగాయి. నేడు నురేఖ సంస్థ షేర్లు మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ కంపెనీ రూ.100 కోట్ల సమీకరణకు ఐపీవోకు రాగా.. 40 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. 

ఇవీ చదవండి

కార్వీ డీమ్యాట్‌ ఖాతాలు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ చేతికి

ముక్కు ద్వారా ఇచ్చేకొవిడ్‌-19 టీకాపై ఉక్రెయిన్‌ ఆసక్తి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని