Stock market: సూచీలను వెనక్కి లాగిన ఆటో, ఫైనాన్స్‌! - Stock market indices ended in red
close

Updated : 09/06/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: సూచీలను వెనక్కి లాగిన ఆటో, ఫైనాన్స్‌!

ముంబయి : వాహన, ఫైనాన్స్‌ రంగాలు సహా రిలయన్స్‌ వంటి దిగ్గజ సంస్థల షేర్లకు లాభాల స్వీకరణ ఎదురుకావడంతో సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.72.97 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 52,401 పాయింట్ల వద్ద స్తబ్ధుగా ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 51,717 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 333 పాయింట్ల నష్టంతో 51,941 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 104 పాయింట్లు తగ్గి 15,635 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 15,566- 15,800 పాయింట్ల మధ్య కదలాడింది.

బీఎస్ఈ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టైటన్‌, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభపడగా.. రిలయన్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని