Stock market: జీవనకాల గరిష్ఠాలకు సూచీలు - Stock market indices traded Higher
close

Published : 11/06/2021 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: జీవనకాల గరిష్ఠాలకు సూచీలు

ముంబయి : ఐటీ రంగ షేర్ల అండతో శుక్రవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఐటీ రంగ షేర్లతో పాటు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ జంట షేర్లు రాణించడంతో సెన్సెక్స్‌ 52,642 వద్ద,  నిఫ్టీ 15,835 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. తర్వాత బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో గరిష్ఠాల నుంచి దిగొచ్చాయి. అయినప్పటికీ లాభాల్లోనే కొనసాగాయి. చివరకు సెన్సెక్స్‌ 174 పాయింట్ల లాభంతో 52,474 వద్ద ముగియగా.. నిఫ్టీ 61  పాయింట్లు ఎగబాకి 15,799 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.06 వద్ద నిలిచింది. ఐటీ కంపెనీల షేర్లు నేటి ట్రేడింగ్‌లో దూసుకెళ్లాయి. విప్రో, టెక్ మహీంద్రా షేర్లు రికార్డు గరిష్ఠాలకు చేరగా.. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు సైతం గరిష్ఠాలకు దగ్గరగా వెళ్లాయి. 

సెన్సెక్స్‌ 30 సూచీలో డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, టెక్ మహీంద్రా, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని