Stock market: వరుసగా మూడో రోజూ నష్టాలే..! - Stock markets Ends In Red
close

Updated : 28/07/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: వరుసగా మూడో రోజూ నష్టాలే..!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజైన బుధవారమూ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు క్రమంగా ఇంట్రాడే కనిష్ఠాలను తాకాయి. అయితే, కీలక రంగాల్లో కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు ఇంట్రాడే కనిష్ఠాల నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 650 పాయింట్లు దిద్దుబాటుకు గురైంది. అయినప్పటికీ.. లాభాల్లోకి మాత్రం రాలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 135 పాయింట్ల నష్టంతో 52,443 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 15,709 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.39 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, బజాజ్‌ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ షేర్లు లాభాల్లో ముగియగా.. కొటాక్ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, నెస్లే ఇండియా, మారుతీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని