Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు - Stock markets Ends In green
close

Updated : 26/07/2021 15:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: నష్టాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన సూచీలు ఓ దశలో లాభాల్లోకి జారుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నుంచి లభించిన మద్దతును రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నష్టాలు తగ్గించాయి. దీంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి జారుకొని ఇంట్రాడే కనిష్ఠాల్ని నమోదు చేశాయి. చివరకు సెన్సెన్స్‌ 123 పాయింట్ల నష్టంతో 52,852 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 15,824 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద నిలిచింది.

బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టైటన్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, ఎన్‌టీపీసీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. రిలయన్స్‌, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని