Stock market: కొనసాగుతున్న లాభాల జోరు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు! - Stock markets are in Green
close

Updated : 04/08/2021 09:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: కొనసాగుతున్న లాభాల జోరు.. సరికొత్త గరిష్ఠాలకు సూచీలు!

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో రోజైన బుధవారమూ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద.. నిఫ్టీ 118 పాయింట్లు లాభపడి 16,249 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో తొలిసారి 54 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌.. నిన్న 16 వేల మైలురాయిని దాటి దూసుకెళ్తున్న నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలకు చేరాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.17 వద్ద ట్రేడవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగియగా.. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. వీటికి తోడు దేశీయంగా వ్యాక్సినేషన్‌ పురోగతి, వాహన విక్రయాలు, సానుకూల త్రైమాసిక ఫలితాలు, తయారీ కార్యకలాపాల వంటి అంశాలు మదుపర్లలో విశ్వాసం నింపాయి. అలాగే కీలక కంపెనీలు రాణించడం కూడా సూచీలకు దన్నుగా నిలుస్తోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, రిలయన్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. భారతీ ఎయిర్‌టెల్‌, ఎస్‌బీఐ, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని