close

తాజా వార్తలు

19న టాటా నిక్సన్‌ ఈవీ విడుదల

ముంబయి: టాటా మోటార్స్‌ నిక్సన్‌ ఈవీ డిసెంబర్‌ 19న మార్కెట్‌కు పరిచయం చేయనుంది. తొలుత డిసెంబర్‌ 17 అనుకున్నప్పటికీ అనివార్య కారణాలతో ఈ కార్యక్రమం రెండు రోజులపాటు వాయిదాపడింది. కారణాలను కంపెనీ వెల్లడించలేదు. దీనిని ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం(జనవరి-మార్చి)లో విడుదల చేసేఅవకాశం ఉంది. కంపెనీ సరికొత్త జిపట్రాన్‌ ఎలక్ట్రానిక్‌పవర్‌ ట్రైన్‌ టెక్నాలజీతో నిర్మించిన తొలికారు ఇదే కావడం గమనార్హం. 

ఈకారులో పర్మినెంట్‌ మాగ్నెట్‌ ఏసీ మోటార్‌ను అమర్చారు. ఇది లిథియం అయాన్‌ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. ఈ కారు ఒక సారి ఛార్జి చేస్తే 250-300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఈ కారు బ్యాటరీపై టాటామోటార్స్‌ 8 సంవత్సరాల వారెంటీని ఆఫర్‌ చేయనున్నట్లు ప్రకటించింది. దీనిలో డెడికేటెడ్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌సిస్టమ్‌ను అమర్చారు. ఇది జిపట్రాన్‌ పవర్‌ట్రైన్‌ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది. దీనికి ప్రత్యేకమైన కూలింగ్‌ సర్క్యూట్‌ ఉంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.