రెండేళ్లు అపరిమిత కాల్స్‌ రూ.1999కే - Unlimited with just rs 1999 from jio along with Jio
close

Updated : 27/02/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండేళ్లు అపరిమిత కాల్స్‌ రూ.1999కే

నెలకు 2జీబీ డేటా కూడా
సరికొత్త జియోఫోన్‌ సహా

ముంబయి: రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్‌, నెలకు అధికవేగం 2 జీబీ డేటా.. తదుపరి పరిమితవేగంతో అపరిమిత డేటా, సరికొత్త జియోఫోన్‌ కూడా కలిపి రూ.1999కి ఇవ్వనున్నట్లు రిలయన్స్‌ జియో శుక్రవారం ప్రకటించింది.  ఇవే సదుపాయాలు ఏడాది కాలావధికి కావాలనుకుంటే రూ.1499 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ‘కొత్త జియోఫోన్‌ 2021’ కింద ప్రకటించిన ఈ ఆఫర్‌ మార్చి 1 నుంచి రిలయన్స్‌ రిటైల్‌, జియో రిటైలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. గతంలోనే జియోఫోన్‌ కొనుగోలు చేసినవారు ఏడాదికి రూ.749 చొప్పున రీఛార్జి చేసుకోవచ్చని తెలిపింది. ‘ఇప్పటికీ దేశంలో 30 కోట్ల మంది 2జీ ఫీచర్‌ ఫోన్లు వినియోగిస్తున్నారు. వీరు అధికఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. మా నినాదమైన ‘2జీ ముక్త్‌ భారత్‌’ కింద వీరందరినీ 4జీలోకి మార్చేందుకు, నెలవారీ చెల్లింపుల పరంగా మేలు చేయడం కోసం అధికవేగం డేటా, అపరిమిత కాల్స్‌, ఫోన్‌ కూడా కలిపి తక్కువ ధరలో ఇస్తున్నామ’ని రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ పేర్కొన్నారు. సమాజంలో డిజిటల్‌ అంతరం తొలగించడమే ధ్యేయంగా ఈ సదుపాయం తెచ్చినట్లు వివరించారు.

ఇవీ చదవండి..

డిపాజిట్‌..నెలనెలా వెనక్కి...

100 శాతం ప్రీమియం తిరిగి వచ్చే ఆరోగ్య బీమా పథకం!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని