బీఎండబ్ల్యూ పెట్రోల్‌220ఐ స్పోర్ట్‌ @రూ.37.9లక్షలు - bmw drives in 220i sport
close

Published : 24/03/2021 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీఎండబ్ల్యూ పెట్రోల్‌220ఐ స్పోర్ట్‌ @రూ.37.9లక్షలు

దిల్లీ: జర్మన్‌ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. 2020ఐ స్పోర్ట్‌ పేరిట 2 సిరీస్‌ గ్రాన్‌ కూపేలో మరో కొత్త మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. పెట్రోల్‌ వేరియంట్‌ అయిన ఈ కారు భారత్‌లోని అన్ని బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద లభించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కొత్త కారును చెన్నై ప్లాంటులోనే ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొంది. దీని ధరను రూ.37.9 లక్షలుగా నిర్ణయించారు. 2-లీటర్‌, 4-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందిన బీఎండబ్ల్యూ 220ఐ స్పోర్ట్‌ 190 హెచ్‌పీ సామర్థ్యంతో 7.1 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. 1,350-4,600 ఆర్‌పీఎం వద్ద 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది.

స్టైలింగ్ పరంగా, డీజిల్ వెర్షన్‌తో పోల్చితే డ్రైవర్-ఫోకస్డ్ కాక్‌పిట్‌తో పాటు స్పోర్టీ లుక్‌లో ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. లైవ్‌ కాక్‌పిట్‌ కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ కారు డ్యాష్‌బోర్డులో 8.8 అంగుళాల కంట్రోల్‌ డిస్‌ప్లే, త్రిడీ నావిగేషన్‌, 5.1 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను పొందుపరిచారు. బీఎండబ్ల్యూ వర్చువల్‌ అసిస్టెంట్‌ సాయంతో కారును ఓరల్‌ కమాండ్స్‌తో నియంత్రించవచ్చు. రేర్‌ వ్యూ కెమెరాతో కూడిన పార్కింగ్‌ అసిస్టెంట్‌, రివర్సింగ్‌ అసిస్టెంట్‌ అదనపు ఫీచర్లు. దీంట్లో మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చారు.

ఇవీ చదవండి..

జాగ్వార్‌ విద్యుత్‌ ఎస్‌యూవీ

హ్యుందాయ్‌ 7 సీట్ల అల్కజార్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని