బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో ప్రైవేటు బ్యాంకుల మద్దతు కావాలి
close

Published : 07/05/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో ప్రైవేటు బ్యాంకుల మద్దతు కావాలి

ఎస్‌బీఐ ఎండీ స్వామినాథన్‌

ముంబయి: బ్యాడ్‌ బ్యాంకు ఏర్పాటులో ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుంటాయని, కాకపోతే దీనికి ప్రైవేటు బ్యాంకులు, రుణదాతల మద్దతు కావాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. అందరు రుణదాతలు ముందుకొస్తే బడ్జెట్‌లో ప్రకటించిన నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీ) ఏర్పాటు సులభమవుతుందని, అది ఉత్తమ పరిష్కార మార్గం చూపుతుందని, తద్వారా ఒత్తిడిలో ఉన్న ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. బ్యాడ్‌ బ్యాంక్‌ లేదా ఎన్‌ఏఆర్‌సీకి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్దిష్టమైన నమూనాను  ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌కు సహాయం చేయడానికి కొంత సార్వభౌమ హామీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు డజన్లకు పైగా అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలున్నా, 40 శాతం కేసుల్ని కూడా పరిష్కరించడం లేదు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని