లావా నుంచి జడ్‌2 మ్యాక్స్‌
close

Published : 12/05/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లావా నుంచి జడ్‌2 మ్యాక్స్‌

ధర రూ.7,799

దిల్లీ: లావా ఇంటర్నేషనల్‌ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘జడ్‌2 మ్యాక్స్‌’ను విపణిలోకి విడుదల చేసింది. 2జీబీ ర్యామ్‌, 32 జీబీ నిల్వ సామర్థ్యం కలిగిన మోడల్‌ ధర రూ.7,799గా నిర్ణయించారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు వీలుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశామని కంపెనీ తెలిపింది. 7 అంగుళాల తెర, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, మీడియాటెక్‌ హీలియో ప్రొసెసర్‌, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమేరా, 13 మెగాపిక్సెల్‌+ 2 మెగాపిక్సెల్‌ వెనుక కెమేరాలు, ఆండ్రాయిడ్‌ 10 (గోఎడిషన్‌) ఆపరేటింగ్‌ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. లావా ఇ-స్టోర్‌, ఆఫ్‌లైన్‌ విక్రయశాలలు, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లపై జడ్‌2 మ్యాక్స్‌ లభిస్తుందని కంపెనీ తెలిపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన తప్పనిసరిగా మారిందని, అయితే బ్యాటరీ సామర్థ్యం, తెర పరిమాణం, స్పష్టత వంటివి ఇబ్బందికరంగా మారాయని, వీటన్నింటికి జడ్‌2 మ్యాక్స్‌ పరిష్కారమని కంపెనీ ప్రోడక్ట్‌ హెడ్‌ తేజిందర్‌ సింగ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని