అక్టోబరు నుంచి రుణ మేళాలు
close

Updated : 26/08/2021 06:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్టోబరు నుంచి రుణ మేళాలు

ముంబయి: రుణాలకు గిరాకీ లేదని ఇపుడే చెప్పడం తొందరపాటే అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రుణ వృద్ధి కోసం అక్టోబరు నుంచి బ్యాంకులు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేపడతాయని బుధవారం ఇక్కడ ప్రకటించారు. 12 ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో ఇక్కడ సమావేశమై, 2021-22కు సంస్కరణల (ఈజ్‌ 4.0 ఇండెక్స్‌)ను ఆవిష్కరించారు. కొవిడ్‌ అనంతరం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలకు మద్దతుగా రుణ వృద్ధికి కృషి చేస్తామంటూ, 2019 చివర్లో 400 జిల్లాల్లో బ్యాంకులు ‘రుణ మేళాలు’ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 అక్టోబరు నుంచి 2021 మార్చి వరకు బ్యాంకులు రూ.4.94 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేశాయని మంత్రి తెలిపారు. ఈ ఏడాది కూడా అక్టోబరు నుంచి దేశంలోని ప్రతి జిల్లాలో రుణ మేళాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ)-సూక్ష్మ ఆర్థిక సంస్థ (ఎంఎఫ్‌ఐ)ల ద్వారా రూ.1.5 లక్షల వరకు వ్యక్తులకు రుణాలు ఇచ్చేందుకు సిద్ధమని వెల్లడించారు. ప్రతి జిల్లా నుంచి ఎగుమతులు జరిగేలా, ఎగుమతిదార్లకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు.

* ఈక్విటీ, డెట్‌ మార్గాల్లో నిధుల సమీకరణ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆగస్టు 29న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుందని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఎంత మేర నిధులు సమీకరించాలని అనుకుంటోందీ వెల్లడించలేదు.

* క్యూఐపీతో రూ.3,000కోట్లు సమీకరించాలని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. ఇష్యూలో ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.66.19ను నిర్ణయించారు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని