సంక్షిప్త వార్తలు
close

Published : 17/10/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్త వార్తలు

పరోక్ష పన్నులు వసూలుకు కేవీబీకి అనుమతి 

ఈనాడు, హైదరాబాద్‌: కరూర్‌ వైశ్యా బ్యాంకు (కేవీబీ)కు సీబీఐసీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌) తరఫున పరోక్ష పన్నులు వసూలు చేయటానికి భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అనుమతి ఇచ్చింది. దీనివల్ల కరూర్‌ వైశ్యా బ్యాంకు ఖాతాదార్లు అదే బ్యాంకు ద్వారా పరోక్ష పన్నులు చెల్లించే అవకాశం ఏర్పడింది. సీబీఐసీతో ‘ఇంటిగ్రేషన్‌’ ప్రక్రియ పూర్తికాగానే ఈ సదుపాయాన్ని ఖాతాదార్లకు అందుబాటులోకి తీసుకువస్తామని కరూర్‌ వైశ్యా బ్యాంకు ఎండీ అండ్‌ సీఈఓ బి.రమేష్‌ బాబు తెలిపారు.


ఎంఎం ఫోర్జింగ్స్‌ చేతికి కఫోమా ఆటోపార్ట్స్‌

దిల్లీ: మెషీన్డ్‌ క్రాంక్‌షాఫ్ట్స్‌ సరఫరా సంస్థ కఫోమా ఆటోపార్ట్స్‌ను రూ.33 కోట్లకు కొనుగోలు చేసినట్లు వాహన విడిభాగాల సంస్థ ఎంఎం ఫోర్జింగ్స్‌ వెల్లడించింది. రూ.28 కోట్లు నగదుగా, రూ.5 కోట్లు రుణ ప్రాతిపదికన ఈ ఒప్పందం కుదిరినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఈ కొనుగోలుతో కంపెనీ సామర్థ్యం నెలకు 60,000 మెషీన్డ్‌ క్రాంక్‌షాఫ్ట్స్‌కు చేరనుంది. ఆటోమోటివ్‌, వాణిజ్య వాహనాలు, ఎగుమతులు, వ్యవసాయ పరికరాలు, పారిశ్రామిక, మెరైన్‌ అప్లికేషన్‌లకు సంయుక్త సంస్థ పూర్తి స్థాయి మెషీన్డ్‌ క్రాంక్‌షాఫ్ట్స్‌ సరఫరాదారుగా మారనుంది.


పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

ముంబయి: అక్టోబరు 8తో ముగిసిన వారానికి విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు 2.039 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.15,000 కోట్లు) పెరిగి 639.516 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.48 లక్షల కోట్లు)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడమే ఇందుకు కారణం. విదేశీ కరెన్సీ ఆస్తులు 1.55 బిలియన్‌ డాలర్లు పెరిగి 577.001 బిలియన్‌ డాలర్లకు చేరాయి. బంగారు నిల్వలు 464 మి.డాలర్లు పెరిగి 38.022 బిలియన్‌ డాలర్లుతో ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఐఎంఎఫ్‌ వద్ద దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్‌) 28 మిలియన్‌ డాలర్లు పెరిగి 19.268 బిలియన్‌ డాలర్లకు చేరాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని