విపణిలోకి టాటా పంచ్‌
close

Published : 19/10/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపణిలోకి టాటా పంచ్‌

ధర రూ.5.49-9.09 లక్షలు

దిల్లీ: టాటా మోటార్స్‌ తమ సబ్‌-కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహన (ఎస్‌యూవీ)మైన పంచ్‌ను సోమవారం విపణిలోకి విడుదల చేసింది. ఈ వాహనం రూ.5.49-9.09 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధరల శ్రేణిలో లభించనుంది. ఏఎల్‌ఎఫ్‌ఏ ఆర్కిటెక్చర్‌పై పంచ్‌ను టాటా మోటార్స్‌ తయారు చేసింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో ఇవి రూపొందాయి. మాన్యువల్‌ వేరియంట్ల ధర రూ.5.49-8.49 లక్షలు కాగా, ఏఎంటీ రకం కార్లు రూ.6.09-9.09 లక్షల మధ్య ఉన్నాయి. మాన్యువల్‌ కార్లు లీటరుకు 18.97 కి.మీ. మైలేజీ, ఆటోమేటిక్‌ కార్లు 18.82 కి.మీ మైలేజీ ఇస్తాయని కంపెనీ ప్రయాణికుల వాహనాల బిజినెస్‌ యూనిట్‌ (పీవీబీయూ) ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. చిన్న కార్లలో ఎస్‌యూవీ ప్రమాణాలు ఉండేలా పంచ్‌ను తీసుకొచ్చినట్లు వివరించారు. ఈ వాహనం అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల్లో (ఎన్‌క్యాప్‌) 5-స్టార్‌ రేటింగ్‌ను సాధించడం విశేషం. ఆల్ట్రోజ్‌, నెక్సాన్‌ తర్వాత 5 స్టార్‌ రేటింగ్‌ పొందిన మోడల్‌ మళ్లీ ఇదే. పొడవైన సీట్లు, హైగ్రౌండ్‌ క్లియరెన్స్‌, 370 ఎంఎం వాటర్‌ వేడింగ్‌ క్యాపబిలిటీ, ఇంజిన్‌ డ్రైవ్‌ మోడ్‌లు, ఐడల్‌ స్టార్ట్‌- స్టాప్‌ ఫంక్షన్‌, క్రూజ్‌ నియంత్రణ, పుష్‌ బటన్‌ స్టార్ట్‌, 366 లీటర్ల బూట్‌స్పేస్‌, కూల్డ్‌ గ్లోవ్‌ బాక్స్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ప్లే హార్మన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ ఉష్ణోగ్రత నియంత్రణ, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్‌ సెన్సింగ్‌ వైపర్లు తదితర ఫీచర్లు ఈ కార్లలో ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని