బ్యాంకులకు స్థిరత్వం
close

Published : 20/10/2021 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్యాంకులకు స్థిరత్వం

‘ప్రతికూలం’ నుంచి రేటింగ్‌ పెంచిన మూడీస్‌

ముంబయి: భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్‌ అంచనాలను ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ పెంచింది. ఆస్తుల నాణ్యత క్షీణత క్రమంగా తగ్గుతూ వస్తుండడం; ఆర్థిక రికవరీతో పాటు, రుణ వృద్ధి పుంజుకునే అవకాశాలు కనిపిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. భారత సార్వభౌమ రేటింగ్‌ అంచనాలను కూడా ‘ప్రతికూలం’ నుంచి ‘స్థిరత్వం’కు ఈ నెల మొదట్లో ఈ సంస్థ మార్చిన సంగతి విదితమే. మంగళవారం విడుదల చేసిన ‘బ్యాంకింగ్‌ సిస్టమ్‌ అవుట్‌లుక్‌-ఇండియా’ నివేదికలో మూడీస్‌ ఇంకా ఏమందంటే..

* భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 12-18 నెలల్లో రికవరీని కొనసాగిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతం వృద్ధిని; 2022-23లో  7.9 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చు.

* ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల రుణాల్లోనూ వృద్ధి కనిపించొచ్చు. ఏటా రుణ వృద్ధి 10-13 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం.

* బలహీన కార్పొరేట్‌ ఫలితాలు; నిధులకు ఇబ్బందుల వంటి నష్టభయాలన్నీ తగ్గుతూ వస్తున్నాయి.

* రిటైల్‌ రుణాలు పరిమితంగానే తగ్గుతున్నాయి. ఎందుకంటే భారీ స్థాయిలో ఉద్యోగ నష్టాలేమీ జరగలేదు.

* రుణ వ్యయాలు తగ్గుతుండడంతో ఆస్తుల నాణ్యత మెరుగై, లాభదాయకతను పెంచుతుంది.

* ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి భారీ స్థాయి మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నాం.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని