7 రోజుల లాభాల పరుగుకు విరామం
close

Published : 20/10/2021 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

7 రోజుల లాభాల పరుగుకు విరామం

ఇంట్రాడేలో 62000కు సెన్సెక్స్‌
సమీక్ష

సూచీల ఏడు రోజుల రికార్డు జోరుకు అడ్డుకట్ట పడింది. గరిష్ఠ స్థాయుల్లో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్‌ తొలిసారిగా 62000 పాయింట్ల ఎగువకు చేరడం విశేషం. హెచ్‌యూఎల్‌ ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు డీలాపడగా, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్లు మెరిశాయి. మిలాద్‌ ఉన్‌ నబి సందర్భంగా దేశీయ కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు. ఆసియా మార్కెట్లు లాభపడగా, ఐరోపా సూచీలు సైతం సానుకూలంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,156.48 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 62,245.43 పాయింట్ల వద్ద తాజా జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఈ దశలో అమ్మకాల ఒత్తిడి ఎదురై ఒకదశలో 61,594.29 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చేరిన సెన్సెక్స్‌, చివరకు 49.54 పాయింట్ల నష్టంతో 61,716.05 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 58.30 పాయింట్లు కోల్పోయి 18,418.75 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,604.45 వద్ద రికార్డు గరిష్ఠాన్ని నమోదుచేసింది.

* ఇంట్రాడేలో 5 శాతం కోల్పోయిన హెచ్‌యూఎల్‌ షేరు రూ.2521.40 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.06 శాతం నష్టంతో రూ.2546.45 వద్ద ముగిసింది.

* త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో టాటా కాఫీ షేరు ఇంట్రాడేలో 8.45 శాతం పెరిగి రూ.254 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరింది. చివరకు 0.60 శాతం లాభంతో రూ.235.60 వద్ద ముగిసింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 నష్టపోయాయి. ఐటీసీ 6.23%, టైటన్‌ 3.97%, టాటా స్టీల్‌ 3.10%, అల్ట్రాటెక్‌ 3.01%, పవర్‌గ్రిడ్‌ 2.60%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.14%, ఎస్‌బీఐ  1.89%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.79%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.71%, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.51% మేర నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా 4.12%, ఎల్‌ అండ్‌ టీ 3.26%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.99%, ఇన్ఫోసిస్‌ 1.63%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.13% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో స్థిరాస్తి, ఎఫ్‌ఎమ్‌సీజీ, మన్నికైన వినిమయ వస్తువులు, లోహ 4.56% వరకు పడ్డాయి. ఐటీ, టెక్‌, యంత్ర పరికరాలు, ఇంధన, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 2427 షేర్లు నష్టాల్లో ముగియగా, 935 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 127 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని