యెస్‌ బ్యాంక్‌ లాభంలో 74% వృద్ధి
close

Published : 23/10/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యెస్‌ బ్యాంక్‌ లాభంలో 74% వృద్ధి

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికానికి యెస్‌ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.225 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ.129 కోట్లతో పోలిస్తే ఇది 74 శాతం అధికం. వ్యాపారాల్లో మెరుగైన వృద్ధికి తోడు, కేటాయింపులను పరిమితం చేసుకోవడం వల్ల లాభం పెరిగిందని యెస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.5,842.81 కోట్ల నుంచి రూ.5,430.30 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం 23.4 శాతం తగ్గి రూ.1,512 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.1 శాతం నుంచి 2.2 శాతానికి పరిమితమైంది. స్థూల నిరర్థక ఆస్తులు 16.9 శాతం నుంచి 15 శాతానికి తగ్గాయి. అయితే నికర నిరర్థక ఆస్తులు మాత్రం 4.71 శాతం నుంచి పెరిగి 5.55 శాతానికి చేరాయి. మొత్తం కేటాయింపులు రూ.1,078 కోట్ల నుంచి 65 శాతం తగ్గి రూ.377 కోట్లకు పరిమితమైంది. సమీక్షా త్రైమాసికంలో ఒక టెలికాం కంపెనీకి సంబంధించిన బకాయికే యెస్‌ బ్యాంక్‌ రూ.336 కోట్లను కేటాయించడం గమనార్హం.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని