మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌ - maruti suzuki rises nearly 1percent on hike in car prices
close

Updated : 19/01/2021 16:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తన కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు జనవరి 18వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. దీంతో కంపెనీ షేర్లు దాదాపు 1శాతం వరకు పెరిగాయి. కొన్ని రకాల మోడళ్ల ధరలను దాదాపు రూ.34 వేల(దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో) వరకు పెంచామని సంస్థ వెల్లడించింది. ముడి పదార్థాల ధరలు పెరగటమే దీనికి కారణమని వెల్లడించింది.
 

ఇప్పటికే హ్యుందాయ్‌, కియా, మహీంద్రా వంటి సంస్థలు తమ వాహనాల ధరలను పెంచాయి. పెరిగిన ధరలు కొత్త సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ తర్వాత నుంచి ఆటోమొబైల్‌ పరిశ్రమ వేగంగా పుంజుకుంటున్న విషయం తెలిసిందే. గతేడాది మారుతీ విక్రయాలు దాదాపు 18శాతం తగ్గి 12,13,660గా నమోదయ్యాయి.

గరిష్ఠంగా ధరల పెంపు ఇలా.. 

ఆల్టోపై గరిష్ఠంగా రూ.14వేలు, ఎస్‌ప్రెస్సోపై రూ7వేలు, సెలిరియోపై రూ.19,400, వేగనార్‌పై రూ.23,200, టూర్‌ ఎస్‌ పై రూ.5,061, ఎకోపై రూ.24,200, స్విఫ్ట్‌పై రూ.30వేలు, డిజైర్‌పై రూ.12,500, బ్రెజాపై రూ.10వేలు, ఎర్టిగాపై రూ.34వేలు, సూపర్‌ క్యారీపై రూ.10వేలు పెంచింది.  మొత్తంలోకి ఎర్టిగా, స్విఫ్ట్‌పై పెంపు రూ.30వేలకు పైగా ఉంది.

ఇవీ చదవండి

ఆర్థిక మంత్రికి అండదండలు

ఈ బడ్జెట్‌ భిన్నం.. ఎందుకంటే..?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని