వారంలో రెండోసారి తగ్గిన ఇంధన ధరలు! - petrol diesel prices again slashed in india second time in week
close

Published : 30/03/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారంలో రెండోసారి తగ్గిన ఇంధన ధరలు!

దిల్లీ: దేశంలో ఇంధన ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్వల్పంగా తగ్గించాయి.దేశవ్యాప్తంగా లీటర్‌ పెట్రోల్‌పై 19-22 పైసలు, డీజిల్‌పై 21-23 పైసలు తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయించాయి.  కాగా, గత ఆరు రోజుల వ్యవధిలో దేశంలో ఇంధన ధరలు తగ్గించడం ఇది రెండోసారి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 22 పైసలు తగ్గి రూ.90.56కు చేరగా.. డీజిల్‌ ధర 23 పైసలు తగ్గి రూ.80.87కు చేరింది. 

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.16 నమోదు కాగా, డీజిల్‌ ధర రూ.88.20కి చేరింది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.96.98, డీజిల్‌ ధర రూ.87.96 నమోదు కాగా.. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.66, డీజిల్‌ ధర రూ.85.96కు తగ్గాయి. సూయిజ్‌ కాలువలో వారం రోజులుగా నిలిచిపోయిన ఓడ సోమవారం తిరిగి కదలడంతో ముడిచమురు ధరలు 1శాతం తగ్గాయి. అంతేకాకుండా కొత్తగా కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్ల కారణంగా యూరప్‌లో లాక్‌డౌన్‌ పునరుద్ధరించడంతో అక్కడ ఇంధనానికి డిమాండ్‌ పడిపోవడమూ ఇంధన ధరల తగ్గుదలకు ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని